Friday, August 16, 2019

గంగపుత్ర కుటుంబాల బహిష్కరణ

గంగపుత్ర కుటుంబాల బహిష్కరణ 
17-08-2019 03:46:28
ఏర్గట్ల, ఆగస్టు 16: నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్‌లో 25 గంగపుత్ర కుటుంబాలపై గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) సాంఘిక బహిష్కరణ విధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో ఎత్తిపోతల నీటితో నింపిన చెరువులను చేపల పెంపకం కోసం ఉపయోగించుకునేందుకు గంగపుత్రులు రూ.లక్షా యాభై వేలు కట్టాలని వీడీసీ డిమాండ్‌ చేయగా, వారు నిరాకరించడంతో బహిష్కరణ విధించారు. ఆ కుటుంబాలు చెరువుల్లో చేపలు పట్టకుండా, మహిళలు బీడీలు చుట్టకుండా, నిత్యావసర వస్తువులు ఇవ్వకుండా, కూలీ పనులకు వెళ్లకుండా, ప్రయాణ సౌకర్యం కల్పించకుండా, మంగళి షాపులకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. శుక్రవారం బాధిత కుటుంబాలు ఏర్గట్ల పోలీ్‌సస్టేషన్‌తో పాటు తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ దీనిపై మత్స్యశాఖ ఏడీకి వినతి పత్రం సమర్పించగా ఎఫ్‌డీవో రాజనర్సయ్య, భీమ్‌గల్‌ సీఐ, ఏర్గట్ల ఎస్సైల వద్ద సమస్య పరిష్కరించినప్పటీకి గంగపుత్ర సంఘం అధ్యక్షుడిగా ఉన్న సాయన్నకు వీడీసీ రూ. 20వేలు జరిమానా విధించిందన్నారు.